News November 17, 2024
వల్లూరు: గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు

వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శుక్రవారం పెన్నా నది నీటిలో గల్లంతైన గణేశ్ అనే యువకుడి కోసం శనివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, బంధువులు, రెస్క్యూ టీంతో పాటు జాలర్ల ద్వారా ట్యూబులు, రబ్బరు బోటు సహాయంతో నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు యువకుడికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
Similar News
News February 25, 2026
కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
News February 25, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.
News February 25, 2026
వేంపల్లి: నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రెండు గంటలకు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.


