News January 10, 2026

వసతి గృహాల్లో పారిశుధ్యానికి పెద్దపీట: కలెక్టర్

image

జిల్లాలోని కేజీబీవీలు, ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన వసతులు, పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. కుల్చారం కేజీబీవీని సందర్శించిన ఆయన.. బోధన, మెనూ, పారిశుధ్యంపై ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో ‘క్లీనింగ్ యాక్టివిటీ’ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో రాజీ పడేది లేదని, అపరిశుభ్రతపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Similar News

News February 13, 2026

మెదక్ జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతం: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్‌తో కలిసి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. సమన్వయంతో పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.

News February 13, 2026

తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

image

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.

News February 13, 2026

మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

image

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.