News February 12, 2025

వసతి గృహాల రిపేర్స్‌కు ప్రపోజల్స్ పంపండి: తిరుపతి కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో మరమ్మతుల నిమిత్తం ప్రపోజల్స్ పంపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  

Similar News

News February 12, 2025

గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి

image

జేఈఈ మెయిన్స్‌ అడ్వాన్స్‌‌డ్ పరీక్షకు అర్హత సాధించిన బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి బాలవీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులలోని గురుకుల పాఠశాలల నుంచి మొత్తం 190 మంది పరీక్షకు హాజరుకాగా 110మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. వారిని మంత్రి స్వామి అభినందించారు

News February 12, 2025

ఈ కార్లు కొనాలంటే నెలల తరబడి చూడాల్సిందే!

image

మహీంద్రా సంస్థకు కార్ల డెలివరీ చాలా ఆలస్యంగా ఇస్తుందన్న పేరుంది. ఆ సంస్థకు చెందిన థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ కార్ల డెలివరీ టైమ్ భారీగా ఉంటోంది. రాక్స్ బుక్ చేశాక దాని తాళాలు తొలిసారిగా చేతికి దక్కాలంటే 18 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇక స్కార్పియో-ఎన్‌కి 2 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలన్న డిమాండ్ కస్టమర్స్ నుంచి వ్యక్తమవుతోంది.

News February 12, 2025

సిరిసిల్ల: నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: మాస్టర్ ట్రైనర్లు

image

ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఆర్వోలు, ఏఆర్వోలు విధులు నిర్వర్తించాలని మాస్టర్ ట్రైనర్లు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు ఎంతో జాగరూకతతో నిర్వర్తించాలని నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు.

error: Content is protected !!