News February 28, 2026
వాంఖడేలో ‘రవిశాస్త్రి’ స్టాండ్

వాంఖడే స్టేడియంలో లెవెల్-1 స్టాండ్‌కు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. క్రికెటర్, కోచ్, కామెంటేటర్‌గా ఆయన సేవలకు గుర్తింపుగా ప్రెస్ బాక్స్ కింది స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. అలాగే దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీ పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. ముంబై దిగ్గజాలను గౌరవించే క్రమంలో అపెక్స్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది.
Similar News
News February 28, 2026
కొన్నిసార్లు మిలిటరీ యాక్షన్ తప్పదు.. ఇరాన్‌పై ట్రంప్

ఇరాన్‌తో జరుగుతున్న చర్చల పట్ల ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించడం లేదంటూ పెదవి విరిచారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. అయితే వారు చిత్తశుద్ధితో చర్చలు జరపడం లేదని విమర్శించారు. తాము మిలిటరీని వాడొద్దనే అనుకుంటున్నామని, కానీ కొన్నిసార్లు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. సైనిక చర్య వల్ల మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలను కొట్టిపారేయలేమన్నారు.
News February 28, 2026
ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫికేషన్ చేసే ప్రాసెస్‌ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలడమే దీనికి కారణం. మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్‌ను ఆపాలని నిర్ణయించారు. అయితే రేషన్ కోటాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
News February 28, 2026
కివీస్ ఓటమి.. పాక్‌కు దక్కిన లైఫ్ లైన్!

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ బెర్తును ప్రమాదంలో పడేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఎటువంటి లెక్కలతో పని లేకుండా నేరుగా సెమీస్‌కు వెళ్లేవాళ్లమని, మా పని సులువు అయ్యేదని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌లో విఫలమయ్యామని అంగీకరించారు. కివీస్ ఓటమి పాక్‌కు కలిసొచ్చింది. నేడు శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌లోకి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.


