News March 19, 2024
వాగులో పడిపోయిన డీసీఎం.. తప్పిన ప్రమాదం

సత్తుపల్లిలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం పట్టణ శివారులోని వంతెన పైనుంచి వెళ్తుండగా అదుపుతప్పి తమ్మిలేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా వాగులో పూర్తిగా మునిగిన డీసీఎంను పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
Similar News
News September 6, 2025
ఖమ్మం: తరగతి గదిలో టీచర్ల పాత్ర కీలకం

సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
News September 6, 2025
ఖమ్మంను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణ ప్రాంతం, జాఫర్ బావి మరింత సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి పరిశీలించారు. అనంతరం రోప్ వే నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.
News September 6, 2025
KMM: శోభాయాత్ర, నిమజ్జనాలకు కట్టుదిట్టమైన బందోబస్తు

ఖమ్మం నగరంలో శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.