News October 26, 2025
వాజేడు: వాగులో పడి బాలుడి మృతి

వాగులో పడి బాలుడి మృతి చెందిన ఘటన వాజేడు మండలంలో జరిగింది. పేరూరుకు చెందిన బొల్లె జశ్వంత్ (13) స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం పేరూరు భోగిరాల మడుగువాగులో స్నానం కోసం ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు జశ్వంత్ గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కృష్ణ ప్రసాద్ గజ ఈతగాళ్ల సహాయంతో ఆదివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News October 26, 2025
NLG: జిల్లాలో 5.1 సగటు వర్షపాతం

అల్పపీడన ద్రోణి కారణంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో 5.1 మిల్లీమీటర్ల సగటు వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా కొండమల్లేపల్లి మండలంలో 26.5 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లిలో 11.6, మర్రిగూడలో 3.7, మునుగోడులో 10.6, గుడిపల్లిలో 12.5, పీఏ పల్లిలో 19.3, గుర్రంపోడులో 21.1, చిట్యాలలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News October 26, 2025
ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే నియామకం

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీర ప్రాంత జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా కాంతిలాల్ దండే నియమితులయ్యారు. తుఫాను పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు వీరిని నియామించినట్లు అధికారులు తెలిపారు.
News October 26, 2025
కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

కందుకూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కోవూరు రోడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం పురుగు మందు తాగిన ఇద్దరిని కందుకూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఒకరు మరణించారని తెలిసింది. చికిత్స పొందుతూ మరొకరు కూడా మరణించారని సమాచారం. వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.


