News February 16, 2025

వాజేడు: ‘వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఆదివాసీ విద్యార్థి మృతి’

image

వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజులు నుంచి 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(14) జ్వరంతో బాధపడుతున్నా హెచ్ఎం, వార్డెన్ ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవరించారని, అతడికి సరైన చికిత్స అందించలేదని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పునెం సాయి మండిపడ్డారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నిర్లక్ష్యంగా ఉన్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 7, 2025

VKB: మూసీ జన్మస్థలం.. ఔషధ జలధార!

image

అనంతగిరి అడవి ఔషధ గుణాల నిలయంగా విరాజిల్లుతుంది. అనంతగిరి అడవిలో పెరిగే వేలాది మొక్కల వేర్ల నుంచి వడపోతకు గురయ్యే స్వచ్ఛమైన జలమే మూసీ నదికి ఆధారం. నిజాం కాలంలో టీబీ రోగుల చికిత్సకు ఈ కొండల్లో ఆసుపత్రిని నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇదే. పువ్వుల పుప్పొడి, పచ్చని చెట్ల ఫైటో న్యూట్రియంట్స్‌తో కూడిన స్వచ్ఛమైన గాలి, ఔషధ జలధార ఆరోగ్యానికి సంజీవనిగా పనిచేస్తాయని నాటి వైద్యులు నమ్మేవారు.

News November 7, 2025

ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.

News November 7, 2025

తూ.గో: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. తూ.గో జిల్లా సీతానగరం మండలానికి చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.