News February 16, 2025
వాజేడు: విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల రోదన

జ్వరంతో విద్యార్థి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వినీత్(14) మంగళవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో విద్యార్థిని 2రోజులు సెలవులకు హాస్టల్ సిబ్బంది ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం రావడంతో ఏటూరునాగారం తరలిస్తుండగా మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. వరంగల్ జిల్లాకు ఏం కావాలంటే?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. WGL కలెక్టరేట్, నూతన బస్టాండ్, సూప్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
News March 12, 2025
సూర్యాపేట జిల్లా వాసుల ఆశలు నెరవేరేనా..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించి తమ ఆశలు నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట ఆటోనగర్‌లో ఐటీ కారిడార్ ఏర్పాటు, ఎస్సారెస్పీ కాల్వలకు నిధులు కేటాయించాలంటున్నారు. తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News March 12, 2025
ఖమ్మం: పట్టుపట్టాడు.. కొలువులు సాధిస్తున్నాడు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువులు సాధించుకుంటూ వస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు. తాజాగా గ్రూప్- 2లో 387 మార్కులతో స్టేట్ 148 ర్యాంక్, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. అతడే తల్లాడ మండలం మల్లవరంకు చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు. తొలి ప్రయత్నంలోనే 2018లో పంచాయితీ కార్యదర్శిగా, 2019లో FBOగా, 2020లో విద్యుత్ శాఖలో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కొలువులను వరుసగా సాధిస్తూ వచ్చాడు.