News April 15, 2025
వాజేడు వ్యాప్తంగా కరపత్రాల కలకలం!

ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా గిరిజన యువజన సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, కడేకల్, పేరూరు, వాజేడు పరిధిలోని కొప్పుసురు, మురుమూరు, ప్రగల్లపల్లి ప్రాంతంలో కరపత్రాలు వెలువడటంతో బయానక వాతావరణం ఏర్పడింది. అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు, ఎంత కాలం ఈ అరాచకాలు అంటూ కరపత్రాల్లో రాశారు.
Similar News
News January 6, 2026
SC ఉత్తర్వులపై విపక్షాల ప్రశ్నలు

ఢిల్లీ అల్లర్ల కేసు(2020)లో సామాజిక కార్యకర్తలు ఉమర్, షర్జీల్‌లకు SC బెయిల్ నిరాకరించడాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. మహిళలపై అత్యాచారం చేసిన కేసు(2017)లో గుర్మీత్ సింగ్‌కు 15వ సారి పెరోల్‌పై కోర్టు విడుదల చేసిందని గుర్తుచేశాయి. విచారణ లేకుండా 5 ఏళ్లు నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని MA బేబీ(CPM) వ్యాఖ్యానించారు. బెయిల్ నిరాకరణ ద్వంద్వ నీతిని బహిర్గత పరుస్తోందని D.రాజా(CPI) అన్నారు.
News January 6, 2026
వరంగల్ పరిధిలో 92 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 92 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 89 మంది మద్యం తాగిన వారితో పాటు ముగ్గురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారు ఉన్నారని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 6, 2026
ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.


