News April 15, 2025

వాజేడు వ్యాప్తంగా కరపత్రాల కలకలం!

image

ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా గిరిజన యువజన సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, కడేకల్, పేరూరు, వాజేడు పరిధిలోని కొప్పుసురు, మురుమూరు, ప్రగల్లపల్లి ప్రాంతంలో కరపత్రాలు వెలువడటంతో బయానక వాతావరణం ఏర్పడింది. అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు, ఎంత కాలం ఈ అరాచకాలు అంటూ కరపత్రాల్లో రాశారు.

Similar News

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

image

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్‌లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.

News September 16, 2025

విజయవాడ ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్‌ ఎఫెక్ట్‌..!

image

దసరా సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్‌ ఎఫెక్ట్‌ పడేలా కనిపిస్తోంది. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చే పవిత్ర సమయంలో, సినిమా తారల నృత్యాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది దుర్గమ్మ ప్రాధాన్యతను తగ్గించడమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.