News December 28, 2024
వాటితో నాకేంటి సంబంధం: మాజీ మంత్రి బుగ్గన

బేతంచెర్లలో గురువారం అధికారులు పలు గోదాములపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే వాటిలో కొన్ని క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయని, ఆ గోదాములు మాజీ మంత్రి బుగ్గనకు సంబంధించిన వారివిగా గుసగుసలు వినిపించాయి. దానిపై బుగ్గను స్పందిస్తూ .. బంధువులు కొందరు ప్రైవేటు గోడౌన్లు నిర్వహిస్తున్న మాట వాస్తవేమని.. అయితే తనకేంటి సంబంధమంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ విచారణలో ఎవరికి చెందినవో బయటకు వస్తాయన్నారు.
Similar News
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 5, 2025
కర్నూలు కలెక్టరే టీచర్

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
News November 5, 2025
11 కంపెనీలలో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూ

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. 11 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.


