News February 5, 2026
వాట్సప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు : ఎస్పీ

వాట్సాప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టరాదని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వాట్సప్ గ్రూపులలో జాయిన్ కావద్దన్నారు. ఈజీ మనీ ఆశతో ఎలాంటి లింకులను ఓపెన్ చేయొద్దు అన్నారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్ డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయాలని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2026
ప్రకాశం: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆర్మీ జవాన్ మృతి

కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలం వెంకటరమణ (45) అస్సోం రాష్ట్రంలోని దిబ్రూగడ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. విధుల్లో ఉండగా సోమవారం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నెల రోజుల క్రితమే తండ్రి వేమయ్య మృతి చెందడంతో సొంత గ్రామానికి వచ్చి తండ్రి దశదినకర్మ నిర్వహించిన అనంతరం వెంకటరమణ విధుల్లో చేరారు.
News February 5, 2026
ప్రకాశం: నిండు గర్భిణిని కత్తితో పొడిచి భర్త పరార్..

నిండు గర్భిణి అయిన భార్యపై భర్త అనుమానం పెంచుకుని కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన గుంజి వెంకటశేషారావు, కరుణ దంపతులు కొద్ది రోజులుగా నెల్లూరు(D) విశ్వనాథరావుపేటలో కాపురం ఉంటున్నారు. ఆయన బిట్రగుంటలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యపై అనుమానంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగగా భార్యపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచి పరారయ్యాడు.
News February 5, 2026
ప్రకాశం జిల్లాలో అధికారిపై సస్పెన్షన్ వేటు.!

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని K.Vపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటి పన్నుల వసూళ్లలో పురోగతి లేకపోవడం, మండలంలోని గాడిపర్తివారిపాలెం ఇన్‌ఛార్జ్ కార్యదర్శిగా ఉంటూ అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడం వంటి కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు డిప్యూటీ MPDO శ్రీధర్ తెలిపారు.


