News February 19, 2026
వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
Similar News
News February 19, 2026
త్వరలో 2,947 పోస్టుల భర్తీ: మంత్రి రవికుమార్

AP: ఈపీడీసీఎల్ పరిధిలో 2,947 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి రవికుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. 581 ఎనర్జీ అసిస్టెంట్లు, 1,260 జూనియర్ లైన్‌మెన్, 1,084 అసిస్టెంట్ లైన్‌మెన్, 22 లైన్‌మెన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
News February 19, 2026
ఒకేఒక్కడు.. చరిత్ర సృష్టించాడు

T20Iలలో విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ చరిత్ర సృష్టించారు. ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 4 క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్‌గా(మెన్స్/ఉమెన్స్) రికార్డు నమోదు చేశారు. T20WCలో నాన్ వికెట్ కీపర్‌గా 4 క్యాచ్‌లు పట్టిన ఐదో ప్లేయర్‌గానూ నిలిచారు. గతంలో డారెన్ సామీ(WI)vsIRE, మార్క్రమ్(SA)vsBAN, మ్యాక్స్‌వెల్(AUS)vsNAM, మున్సే(SCOT)vsITA ఈ ఘనత సాధించారు. కాగా ఇవాళ ఇటలీపై 42 రన్స్ తేడాతో విండీస్ గెలిచింది.
News February 19, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు

బీబీనగర్‌లోని AIIMS 3పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్, టెక్నీషియన్‌కు రూ.40K చెల్లిస్తారు. సైట్:aiimsbibinagar.edu.in


