News January 1, 2026
వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

వాట్సాప్‌లో వచ్చే గుర్తుతెలియని ఏపీకే (APK) ఫైల్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా గురువారం సూచించారు. అమలాపురం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించారు.
Similar News
News February 3, 2026
ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్‌ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్‌పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్‌లాండ్‌పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.
News February 3, 2026
ప్రకాశం: యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
News February 3, 2026
స్వామి వారి ప్రతిష్ట.. భక్తుల మనోభావాలను పట్టించుకోండి…!

కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టు ఎలాంటి రాజకీయ మాటలు వద్దని స్పష్టం చేసింది. కేసు మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటీ నుంచి రాష్ట్ర రాజకీయం తిరుమల లడ్డూ మీదుగా సాగుతుంది. నేతలు వారి ప్రయోజనాల కోసం స్వామివారి ప్రతిష్టను, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ వివాదానికి స్వస్తి పలకాలని కోరుతున్నారు.


