News February 12, 2025

వాట్సాప్‌ ద్వారా సింహాచలం దర్శనం టికెట్స్

image

సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్‌కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

Similar News

News February 19, 2026

ఎంవీపీ: ప్లాస్టిక్ కవర్ల వాడకం.. రూ.1000 జరిమానా

image

జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య గురువారం 18వ వార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్న రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాపుల యజమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యమని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

News February 19, 2026

మారికవలసలో యువకుడి ఆత్మహత్య

image

మధురవాడలోని పి.ఎమ్.పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీలో బ్లాక్ నంబర్ 88లో నివాసముంటున్న పీల శివ (19) బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

News February 18, 2026

మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

image

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.