News October 24, 2025

వాడపల్లికి రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

image

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు.

Similar News

News October 24, 2025

విశాఖ తీరాన అమ్మవారి దివ్య దర్శనం

image

విశాఖ బీచ్ రోడ్‌లోని కాళీమాత దేవాలయం, 1984లో నిర్మించిన అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం. కొలకత్తా దక్షిణేశ్వర్ కాళీ ఆలయం తరహాలో ఉంటుంది. ఇక్కడ కాళీమాతతో పాటు 10 కిలోల ‘రసలింగం’ శివుడు కూడా కొలువై ఉన్నారు. సముద్ర తీరం పక్కనే ఉన్న ఈ ఆలయం, విజయదశమి ఉత్సవాలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో దర్శనం, ఆశీస్సులు పొందవచ్చు.

News October 24, 2025

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో స్కానింగ్ వ్యవహారం రచ్చ(1/2)

image

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో RK CT స్కాన్ వ్యవహారం దుమారం రేపుతోంది. 2017లో ఓ అధికారి సాయంతో ఈ స్కానింగ్ నిర్వాహకుడు ఏకంగా 10 ఏళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నెలకు ఆసుపత్రి నిధుల నుంచి రూ.18-20 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక స్కాన్ మిషన్ రూ. 2 కోట్ల ఖర్చు ఐతే ప్రైవేటుగా పెట్టుకున్న RK CT స్కాన్ నిర్వాహకుడికి ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా చెల్లించి ప్రభుత్వ డబ్బు వృథా చేశారు.

News October 24, 2025

విజయవాడ: ఆసుపత్రి యాజమాన్యంపైనే కేసు..2/2

image

ఇటీవల హాస్పిటల్‌కు ప్రభుత్వం సిటీ స్కాన్‌ను అందించడంతో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. దీంతో తన వ్యాపారం దెబ్బతింటోందని.. 2017లో చేసుకున్న ఒప్పందం ప్రకారం తన వద్దే స్కానింగ్ కొనసాగాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ అతనిపై మరో పిల్ దాఖలు చేసి కౌంటర్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. గత అధికారుల తప్పుడు నిర్ణయాలు ఆస్పత్రికి శాపంలా మారాయని అంతా చర్చించుకుంటున్నారు.