News January 4, 2025

వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

Similar News

News January 6, 2025

నిజరూపంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

image

భద్రాద్రి క్షేత్రంలో కొలువైన జగదభిరాముడి సోమవారం నిజరూప రామావతారంలో దర్శనమిచ్చారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముందుగా దేవస్థాన వేద పండితులు స్వామివారిని బేడా మండపానికి తీసుకొచ్చి రామావతారంలో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద మంత్రోచ్చరణలు,మేళతాళాలు, భక్తుల కోలాటాలు,రామ నామ స్మరణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు.

News January 6, 2025

ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య  

image

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కొత్తగూడానికి చెందిన పవన్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల లెక్చరర్/ యాజమాన్యం వేధింపులు తట్టుకొలేక సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

News January 6, 2025

ALERT.. KMM: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!

image

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా కొత్తగూడెంలో ఓ వ్యక్తికి మాంజా తగిలి గొంతుకు గాయమైన విషయం తెలిసిందే.