News March 19, 2026

వామ్మో.. పోలవరం జిల్లాలోకి మళ్లీ పెద్దపులి

image

నిన్నటివరకు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి బుధవారం రాత్రి మరలా పోలవరం జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. రాజవొమ్మంగి మండలంలోని కొండ లింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీపంలో అటవీప్రాంతంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పులి బోర్నగూడెం సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 9, 2026

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో నేడే పోలింగ్

image

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సా.6 గంటలకు ముగుస్తుంది. కేరళంలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేరళంలో LDF, UDF మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ పినరయి విజయన్ నాయకత్వంలోని LDF, అస్సాంలో NDA హ్యాట్రిక్‌పై కన్నేశాయి. పుదుచ్చేరిలో NDA, INC-DMK కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది.

News April 9, 2026

అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్ నిలబడుతుందా?

image

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్, US సీజ్‌ఫైర్ ఒప్పందం ప్రమాదంలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కాల్పుల విరమణ కావాలా లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం కొనసాగిస్తారా? అమెరికా ఏదో ఒకటి ఎంచుకోవాలి’ అని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని US, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజ్‌ఫైర్ డీల్ కొనసాగడం డౌటేనని రాయిటర్స్ పేర్కొంది.

News April 9, 2026

కోమాలో భర్త.. వీర్యం కోసం కోర్టును ఆశ్రయించిన భార్య

image

ఏడాది కాలంగా కోమాలో ఉన్న తన భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ ఉందని వైద్యులు చెప్పడంతో భర్త స్పెర్మ్‌తో భవిష్యత్తులో తల్లయ్యేందుకు అనుమతివ్వాలని ఆమె కోరారు. ఈ ఆరోగ్య పరిస్థితుల్లో వీర్యం సేకరించడం సాధ్యమేనా తెలుసుకునేందుకు ఓ మెడికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని వేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది.