News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.

Similar News

News September 19, 2025

HYDలో భారీ వరద.. కారు గ్లాస్‌లో నుంచి బయటకు తీశారు

image

గౌలిపురాలో నిన్న రాత్రి భారీ వర్షం కురువడంతో హనుమాన్‌నగర్‌ ఫేజ్‌- 2లో పెద్ద ఎత్తున వరదనీరు చేరుకుంది. మణికొండకు చెందిన ఓ కుటుంబం కారులో వచ్చి దిగేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ఉద్ధృతికి కారు వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు కారులోఉన్న రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలను డోర్ గ్లాస్ లోంచి వారిని బయటికి తీశారు.

News September 19, 2025

HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

image

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.

News September 19, 2025

GWL: ‘రేవులపల్లిలో బ్రిడ్జి నిర్మించాలి’

image

రేవులపల్లి-నందిమల్ల మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి పరిసర గ్రామాల ప్రజలు కోరారు. కాంగ్రెస్ గద్వాల ఇన్‌ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 28న జూరాల సందర్శన సమయంలో బ్రిడ్జిని ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని మీరు ప్రతిపాదించారని, ఇప్పుడు బ్రిడ్జిని మరోచోట నిర్మించేందుకు కుట్ర జరుగుతోందని ఆయనకు వివరించారు.