News December 14, 2025

వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

Similar News

News December 19, 2025

నితీశ్ కుమార్‌కు భద్రత పెంపు

image

ఇటీవల మహిళా డాక్టర్ హిజాబ్ లాగి విమర్శలు ఎదుర్కొంటున్న బిహార్ CM నితీశ్‌కు భద్రత పెంచారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా సంస్థలు సూచించాయని అధికారులు తెలిపారు. నితీశ్‌కు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG) కఠినమైన భద్రతావలయాన్ని విధించినట్లు చెప్పారు. పరిమిత సంఖ్యలో ఉన్నతస్థాయి వ్యక్తులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు.

News December 19, 2025

కోళ్లను పెంచాలనుకుంటున్నారా? ఈ జాతులతో అధిక ఆదాయం

image

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గం. మేలైన జాతి కోళ్లతో మంచి ఆదాయం సాధ్యం. వనరాజ, గిరిరాజ, స్వర్ణధార, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, కడక్‌నాథ్, వనశ్రీ, గాగస్, ఆసిల్ మేలైన జాతి కోళ్లకు ఉదాహరణ. ఇవి అధిక మాంసోత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కలిగి, అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. ఇక BV 380 రకం కోళ్లు ఏడాదిలో 300కి పైగా గుడ్లు పెడతాయి. ఈ కోళ్ల జాతుల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 19, 2025

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (<>ICMR<<>>) 8 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B,Com,BBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు జీతం రూ.30,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in