News February 27, 2026

వారం వరకు EVM-VVPAT వెరిఫై: సీఈసీ

image

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారం రోజుల వరకు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే కౌంటింగ్ రోజూ కూడా వీవీప్యాట్ల లెక్కింపు తప్పనిసరన్నారు. చెన్నైలో మాట్లాడుతూ ఈవీఎంల కంటే ముందు 2 రౌండ్లలోనే పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కించాలని పేర్కొన్నారు.

Similar News

News February 27, 2026

హీరో విజయ్ భార్య సంగీత నేపథ్యమిదే..

image

తమిళ స్టార్ హీరో విజయ్ <<19254560>>భార్య సంగీత<<>> శ్రీలంక తమిళ ఫ్యామిలీకి చెందిన మహిళ. ఈమె తండ్రి యూకేలో వ్యాపారవేత్త కావడంతో ఆమె అక్కడే జన్మించారు. అభిమానిగా విజయ్‌కు సంగీత పరిచయమయ్యారు. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి 1999లో పెళ్లి చేసుకున్నారు. విజయ్ దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈమె భర్తకు సంబంధించిన సినిమా, పొలిటికల్ ఈవెంట్లలోనూ పెద్దగా కనిపించరు.

News February 27, 2026

మార్చి 1 నుంచి పెరగనున్న ఫోన్ ధరలు

image

వివో, iQOOలోని పలు మోడల్స్ ధరలు MAR 1 నుంచి పెరగనున్నట్లు తెలుస్తోంది. Vivo T4 బేస్ వేరియంట్ ₹22,999 ఉండగా ₹26,999కు పెరగనుంది. మిడ్, టాప్ వేరియంట్లూ ₹2వేలు పెరగనున్నాయి. Vivo T4R వేరియంట్లపై చెరో ₹2వేలు, T4Xకు ₹1500 పెరగనుంది. iQOO Z10, iQOO Z10R మోడళ్లు ₹2వేలు పెరగనున్నాయి. ఇక iQOO Z10x బేస్ వేరియంట్‌పై ₹1500, మిడ్, టాప్ వేరియంట్లు ₹2500 పెరగనున్నాయి. ఇప్పటికే శాంసంగ్‌ కూడా ధరలు పెంచింది.

News February 27, 2026

DRDOలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>DRDO<<>>కు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ 8 రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD, ME/MTech, BE/BTech, GATE స్కోరు ఉన్నవారు మార్చి 4 నుంచి 24 వరకు e- మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. RAకు నెలకు రూ.67,000, JRFకు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/