News January 28, 2026
వారసుడిని ప్రకటించే పనిలో ఇరాన్ సుప్రీం లీడర్

USA యుద్ధనౌకలు సమీపించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వారసుడిని నిర్ణయించే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే బంకర్లో దాక్కున్న ఆయన, USకు పట్టుబడ్డా, అంతమైనా పాలన ఆగకుండా ముగ్గురి పేర్లు షార్ట్ లిస్ట్ చేశారని తెలుస్తోంది. ఇందులో తన కొడుకు మొజ్తబా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఫౌండర్ మనవడు రుహొల్లా తదితర పేర్లు విన్పిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీఠమెక్కే ఎవరికైనా పాలన కత్తుల వంతెనపై కవాతే.
Similar News
News February 21, 2026
VASTHU: ఏ అంతస్తులో ఎవరు ఉండాలి?

కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదాలను నివారించడంలో వాస్తుశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరించారు. అంతస్తులు గల భవనాలను సోదరులు ఏవిధంగా పంచుకోవాలో సూచించారు. ‘పై అంతస్తులో చిన్నవారు ఉండాలి. కింద పెద్దవారు నివసించాలి. సభ్యుల సంఖ్యను బట్టి ఈ క్రమాన్నే పాటించాలి. తద్వారా సోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది. మనస్పర్థలు రావు. కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 21, 2026
రాష్ట్రంలో 250 పోస్టులకు నోటిఫికేషన్

<
News February 21, 2026
ఏఐ సమ్మిట్‌పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

AP: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్‌కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు అంతరాయం కలిగించడానికి ఎయిర్‌పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్‌పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.


