News February 15, 2025

వారిని కచ్చితంగా శిక్షించాలి: SP వకుల్ జిందాల్

image

NDPS((నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో నిందితులు కచ్చితంగా శిక్షించాలిలని SP వకుల్ జిందాల్ అన్నారు. విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో దర్యాప్తులో మెలకువలు నేర్పేందుకు శనివారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. NDPS చట్టం చాలా కఠినమైనదని, చట్టంలో పొందుపరిచిన విధివిధానాలను దర్యాప్తు అధికారులు పాటిస్తే నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారన్నారు.

Similar News

News February 19, 2025

గజపతినగరంలో వ్యక్తి అరెస్టు

image

ఓ చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. విజయనగరంలోని ఓ ట్రాన్స్ పోర్ట్ చిట్ ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయిరామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించకపోవడంతో విజయనగరం సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.

News February 19, 2025

పాలకొండ రానున్న వైఎస్ జగన్

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పాలకొండ రాబోతున్నట్లు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం తెలిపారు. ఇటీవల మరణించిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించినున్నట్లు వారు వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారని.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 18, 2025

ఏయూ వైస్ ఛాన్స్‌లర్‌కి విశాఖతో అనుబంధమిదే..!

image

ఏయూ వైస్-చాన్సలర్‌‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!