News April 9, 2024
వారి జీతం ఆపేస్తే అన్ని పంపిణీ చేయవచ్చు: కోటంరెడ్డి

గతంలో సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల నెల జీతం ఆపేస్తే పేద ప్రజలకు అన్ని కానుకలు పంపిణీ చేయవచ్చన్నారు. సోమవారం సాయంత్రం ఉప్పుటూరు, కందమూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Similar News
News October 4, 2025
నెల్లూరు జిల్లాకు వ్యవసాయ పరికరాలు ఇస్తారా?

ఇప్పటికే అక్టోబర్ వచ్చేయడంతో రైతులు సాగుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకొనే పనుల్లో ఉన్నారు. 2024-25 ఏడాదిలో రూ. 286.90 లక్షలు మంజూరు చేయగా.. 151 రొటీవెటర్లు, 569 కల్టివేటర్లు, 482 స్ప్రేయర్లు, 73 గుంటకలు, 53 హాఫ్ కేజీ వీల్స్, 62 బ్రష్ కట్టర్లు తోపాటు మొత్తం 1447 పరికరాలను 50% సబ్సిడీతో సరఫరా చేశారు. మరీ ఈ సీజన్‌కు ఏమాత్రం కేటాయింపులు ఇస్తారో చూడాలి.
News October 4, 2025
నెల్లూరు జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. నేడు సీఎం చంద్రబాబు అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో నెల్లూరు రూరల్ -3441, నెల్లూరు అర్బన్ -1821, సర్వేపల్లి -2651, కోవూరు -2585, కావలి -1888, ఆత్మకూరు -1636, ఉదయగిరి -1406, కందుకూరు -1004, వెంకటగిరి -974 మందిని లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు.
News October 4, 2025
నెల్లూరు: 85 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి

జిల్లాలో 85 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో లాంగ్వేజ్ పండిట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించామన్నారు.