News September 21, 2025
వారు VIP స్లాట్‌లోనే దర్శనానికి రావాలి: దుర్గగుడి EO

దసరా ఉత్సవాలలో దర్శనానికి వచ్చే దాతలు VIP స్లాట్‌లోనే దర్శనానికి రావాలని దుర్గగుడి EO శీనా నాయక్ చెప్పారు. ఉదయం 7-9, మధ్యాహ్నం 3-5 గంటల మధ్యలోనే దాతలు వారి కార్డు తీసుకుని దర్శనానికి రావాలన్నారు. కేశఖండన శాల, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా CC కెమెరాలతో పర్యవేక్షిస్తామని, డబ్బు తీసుకుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Similar News
News September 21, 2025
KNR: నేటితో ‘పెత్తరమాస’ తర్పణాలు లాస్ట్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) ఈనెల 7న ప్రారంభమైంది. ఈ సందర్భంగా పక్షం రోజులు తండ్రి, తాత, ముత్తాతలు, ఇతరులను తలుచుకొని ఆరాధిస్తారు. వారి సంతానం నైవేద్యాలను సమర్పిస్తుంది. ఇలా చేస్తే తర్వాతి తరాలవారిపై పూర్వీకుల దీవెనలు ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. కాగా, నేటితో ఈ తర్పణాల కార్యక్రమాలు ముగియనుండగా సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభం కానున్నాయి.
News September 21, 2025
H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News September 21, 2025
NLG: కానుక.. దసరా తర్వాతే..?

మహిళలు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం షాకిచ్చింది. ఉచిత చీరలు పంపిణీ చేస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అక్టోబర్ తర్వాత చీరలు వస్తాయని, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు మాత్రమే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అవి కూడా ఒకే కలర్ (డ్రెస్ కోడ్)లో ఉంటాయని తెలిసింది. జిల్లాలో 3,66,532 మంది SHG సభ్యులు ఉన్నారు.