News December 11, 2025
వార్డులు.. HYDలో వార్ మొదలు

GHMC వార్డులను 150 నుంచి ఏకంగా 300కు పెంచడంతో నగరంలో ఎన్నికల వేడిని రాజేసింది. ఈ నిర్ణయం కాంగ్రెస్-MIM రహస్య ఒప్పందమంటూ BJP తీవ్రస్థాయిలో మండిపడుతోంది. MIM డివిజన్లను 46 నుంచి 90కి పెంచి, కాంగ్రెస్ పరోక్షంగా లబ్ధి పొందుతోందని కమలదళం ధ్వజమెత్తింది. GHMC పరిధిలోని 50కి పైగా డివిజన్లలోని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు గాలం వేస్తూ ఎన్నికల వ్యూహాలకు INC పదును పెడుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.
Similar News
News March 3, 2026
HCUలో PhDకి దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU) PhD కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 13 కోర్సుల్లో కోర్సులు చేసేందుకు అవకాశముంది. ఆసక్తి, అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. కోర్సులు, అర్హత వివరాలు, ఫీజు తదితర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో <
News March 3, 2026
JNTUHలో 45 మంది అధ్యాపకులకు పదోన్నతులు

JNTUHలో కెరీర్ CAS కింద 45 మంది బోధనా అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. VC డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు సమక్షంలో ఆర్డర్ కాపీలు అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్‌గా 9 మంది, ప్రొఫెసర్‌లుగా 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్‌గా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ హయ్యర్ గ్రేడ్ పే పొందారు.
News March 3, 2026
కీసరగుట్ట ఆలయ గోపురంపై అద్భుత దృశ్యం

నగర శివారులోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీభవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో సోమవారం రాత్రి అద్భుత దృశ్యం కనివిందు చేసింది. స్వామివారి గుడి శిఖరంపై పౌర్ణమి చంద్రుడిని చూసిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని బంధనం చేశారు.


