News December 27, 2025

వార్షిక నేర సమీక్ష.. పెండింగ్ కేసులపై ఎస్పీ ఆరా!

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ రాహుల్ మీనా అధ్యక్షతన వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలోని పెండింగ్ కేసుల దర్యాప్తు తీరుపై ఆయా డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో ఎస్పీ సుదీర్ఘంగా చర్చించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News January 1, 2026

2026లో IPOల జాతర.. లిస్ట్‌లో జియో, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే

image

2026లోనూ IPOల జాతర కొనసాగనుంది. ఈ ఏడాది పలు పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెెట్లో ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.11-12 లక్షల కోట్ల విలువైన పబ్లిక్ లిస్టింగ్‌కు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది తొలి భాగంలోనే IPOకు రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సుమారు రూ.6 లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ పే, జెప్టో, ఓయోతోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు లైన్‌లో ఉన్నాయి.

News January 1, 2026

VZM: బిల్ స్టాప్ (డమ్మీ) మీటర్లతో బురిడీ

image

విజయనగరం జిల్లా విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ‘బిల్ స్టాప్’ (డమ్మీ) మీటర్ల పేరుతో ఓ ఉద్యోగి ఒక్కో మీటరును రూ.10,00-రూ.15,000 విక్రయిస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఈ మీటర్లు అమర్చుకుంటే కరెంట్ వాడకం ఎంత ఉన్నా బిల్లు ‘0’ వస్తుంది. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈఈ త్రినాథరావు బుధవారం తెలిపారు.

News January 1, 2026

మహిళలూ కొత్త సంవత్సరంలో ఇవి ముఖ్యం

image

తల్లి, భార్య, కూతురు, కోడలు పాత్రల్లో జీవిస్తున్న మహిళ తన గురించి తాను మర్చిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయినీ కాపాడుకో.. ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకో.. కొత్తసంవత్సరాన్ని అద్భుతంగా మార్చుకో..