News March 4, 2026

వార్ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా

image

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈనెల 19న రావాల్సిన ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపింది.

Similar News

News March 5, 2026

రేపటి నుంచి భగభగలు!

image

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News March 5, 2026

యుద్ధంపై బెట్టింగ్.. ₹కోట్లు గెలుచుకున్నారు!

image

US-ఇరాన్ యుద్ధంతో ఓ పక్క ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం కాసులపంట పండించుకున్నారు. ఇరాన్‌పై US ఎప్పుడు దాడి చేస్తుందో అంచనా వేసి పాలీమార్కెట్ అనే క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో గత శుక్రవారం 150 మంది బెట్ కాశారు. వీరిలో 16 మంది లక్ష డాలర్లు, ఓ వ్యక్తి 5లక్షల డాలర్లు (₹4కోట్లు) సంపాదించారు. అయితే యుద్ధంపైన బెట్టింగ్ ఏంటని పాలీమార్కెట్ సహా యూజర్లపై విమర్శలు వస్తున్నాయి.

News March 5, 2026

విశాఖ భూగర్భంలో రెడీగా మిలియన్ టన్నుల చమురు!

image

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. అయితే ఇంధన సంస్థల నిల్వలతో పాటు విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరులో అండర్‌గ్రౌండ్‌లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ అంటారు. 2015లో ఫేజ్-1 లాంచ్ కాగా మరిన్ని ఏర్పాటుకానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు వీటిని తీసుకొచ్చారు.