News March 24, 2026

వార్ ఎఫెక్ట్.. రూ.48 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి(FEB 28) నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 8,590 పాయింట్లు(10.56శాతం), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58 శాతం) పడిపోయాయి. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఏకంగా రూ.48.29 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.463 లక్షల కోట్ల నుంచి రూ.415 లక్షల కోట్లకు పడిపోయింది.

Similar News

News April 14, 2026

సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి: CM

image

TG: లోక్‌సభ సీట్ల పెంపుపై అభ్యంతరం తెలుపుతూ సీఎం రేవంత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని తెలిపారు. లోక్‌సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే సపోర్ట్ చేస్తామన్నారు.

News April 14, 2026

కోర్టుల్లో బెంచ్‌ల గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్‌స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్‌లు ఉంటాయి. డివిజన్ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్‌స్టిట్యూషన్ బెంచ్‌లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్‌లు ఉంటాయి.

News April 14, 2026

T20 కెప్టెన్‌గా సూర్య కొనసాగుతారా?

image

భారత T20 కెప్టెన్‌గా సూర్య ఎప్పటివరకు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కెప్టెన్సీలోనే భారత్ T20 WC గెలిచింది. కానీ బ్యాటింగ్‌లో ఆయన తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జులైలో ENG, IREతో జరిగే T20 సిరీస్‌లలో ఆయన ఎలా ఆడతారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్‌లలో రాణిస్తే ఆయన 2028 ఒలింపిక్స్ వరకూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశముందని అంటున్నారు.