News March 19, 2025
వాలీబాల్‌లో మంత్రి సవిత టీమ్ విజయం

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పోర్ట్స్ మీట్ -2025 మంగళవారం సందడిగా ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత నేతృత్వంలోని వాలీబాల్ టీమ్ మంత్రి అనిత టీమ్‌పై విజయం సాధించింది. పురుష ఎమ్మెల్యేలతో జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో మంత్రి సవిత ప్రాతినిధ్యం వహించిన మహిళల జట్టు విజయం సాధించింది. మహిళల టగ్ ఆఫ్ వార్‌లో మంత్రి సవిత టీమ్‌పై మంత్రి అనిత టీమ్ విజయం సాధించింది.
Similar News
News March 20, 2025
KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాజీ CM KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నీ తానే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ అభినందించారు.
News March 20, 2025
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నెల్లూరు జిల్లా వాసి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ గుండ్రాత్ సతీశ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం, మహిమలూరు గ్రామానికి చెందిన DRDO మాజీ ఛైర్మెన్, భారత రక్షణ శాఖ సలహాదారు గుండ్రాత్ సతీశ్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడంపై ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
కదిరిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం దృష్ట్యా గురువారం కదిరిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. నేటి సాయంత్రం నుంచి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు కదిరి పట్టణ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. అనంతపురం, హిందూపురం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు కుటాగుళ్ల, కొత్త బైపాస్ మీదుగా బెంగళూరు వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు.