News November 7, 2025
వాలీబాల్ జట్టుకు ఎంపికైన ములుగు జిల్లా క్రీడాకారులు

ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ జట్టుకు ములుగు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరగనున్న తెలంగాణా సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ములుగు జిల్లా వాలీబాల్ క్రీడాకారులు.. నాలి తరుణ్, కొమరం ఉదయ్, గొంది వసంత్, సోయం నర్సింహ, కొమరం సునీల్, శివ, నరేందర్ ఎంపికయ్యారు.
Similar News
News November 8, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.
News November 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 8, 2025
JIO: ఉచితంగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!

ఇప్పటివరకు 18-25 ఏళ్ల మధ్య వారికే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను ఇప్పుడు 25ఏళ్లు పైబడిన వారికీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. My Jio యాప్‌లో దీన్ని క్లైమ్ చేసుకోవచ్చు. ఇందుకు 5G ప్లాన్ యాక్టివేటై ఉండాలి. దీని ద్వారా రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్ 18నెలల పాటు ఫ్రీగా పొందొచ్చు. ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి.


