News February 24, 2025

వాల్తేరు డీఆర్‌ఎంగా లలిత్‌ బోహ్ర బాధ్యతల స్వీకరణ

image

వాల్తేరు డివిజన్ రైల్వే డీఆర్‌ఎంగా లలిత్‌ బోహ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఆర్‌ఎంగా పని చేసిన సౌరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటి వరకు మనోజ్‌కుమార్‌ సాహు తాత్కాలిక డీఆర్ఎంగా వ్యవహారించారు.

Similar News

News February 24, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ యుాజీసీ జేఆర్ఎఫ్ సాధించిన దివ్యాంగ ఏయూ విద్యార్థి 
➤ వాల్తేర్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రా బాధ్యతలు స్వీకరణ
➤ అవమానంతో తన బిడ్డ చనిపోయాడంటూ గోపాలపట్నంలో నిరసన
➤ రుషికొండలో పల్సస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన
➤ ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజు గడువు పెంపు(మార్చి 13) 
➤ ఆనందపురం ఎస్ఐ ఎడమ చేతికి తీవ్ర గాయం
➤ విశాఖ ఆర్డీవోపై చర్యలకు జర్నలిస్టు సంఘాల డిమాండ్

News February 24, 2025

బకాయిల వసూలుకు వీఎంఆర్డీఏ కమిషనర్ ఆదేశాలు

image

వీఎంఆర్డీఏ నుంచి ఇళ్లు, ఇళ్ళ స్థలాలను కొనుగోలు చేసిన వారి నుంచి బకాయిలను వసూలు చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. దుకాణాల నుంచి అద్దెలు సకాలంలో వసూలు చేయాలని, బకాయిలు ఉంటే నోటీసులు జారీ చేయాలని సూచించారు. దుకాణదారులు నిర్దేశించిన స్థలానికి మించి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 24, 2025

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు గడువు పెంపు

image

ఏయూ దూరవిద్యా కేంద్రంలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు దరఖాస్తు చేయడానికి మార్చి 13 వరకు గడువున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మార్చి 17 వరకు, మార్చ్ 20 వరకు రూ.2000 అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 20 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. మార్చి 28 నుంచి పరీక్షలు ప్రారంభంఅవుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఏయూ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!