News October 12, 2025

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

image

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.

Similar News

News October 12, 2025

బాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేసిన సీపీ

image

విశాఖలో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌‌కు పలు స్వచ్చంధ సంస్థల్లో ఉంటున్న బాల బాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి ప్రత్యేక పాస్‌లు ఏర్పాటు చేశారు. 11 ఆర్గనైజేషన్ల నుంచి సుమారు 300 మంది బాలికలకు పాస్‌లు ఏర్పాటు చేసి వారితో కలిసి సీపీ మ్యాచ్ విక్షించారు. ఈ అవకాశం కల్పించిన సీపీతో పిల్లలు ఫొటోలు దిగారు.

News October 12, 2025

విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల మనోహర్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం విశాఖ రానున్నారు. రాత్రి నగరంలోనే బసచేయునున్న మంత్రి సోమవారం వైఎంసీఏలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మళ్లీ సోమవారం రాత్రికి విశాఖ చేరుకుంటారు.

News October 12, 2025

లోకేశ్ గారు మీరైనా మా’ఘోష’ వినరా..!

image

ఉక్కు యాజమాన్యం ఉద్యోగుల పిల్లల కోసం 1984లో తమ సొంత ఆర్ధిక వనరులతో విశాఖ విమల విద్యాలయం పాఠశాలను ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఉక్కు ఉద్యోగుల పిల్లలు లేరనే దురుద్దేశ్యంతో అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి వారిని రోడ్డున పడేశారు. దీంతో సిబ్బంది జూన్ 12 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఉక్కు యాజమాన్యంతో మంత్రి లోకేశ్ మాట్లాడి పాఠశాల పునఃప్రారంభించాలని సిబ్బంది వేడుకుంటున్నారు.