News April 1, 2025
వాల్మీకిపురం: పదో తరగతి బాలికపై లైంగిక దాడి

పదో తరగతి బాలికపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన వాల్మీకిపురంలో వెలుగు చూసింది. పట్టణంలో ఉండే ఓమైనర్ బాలిక స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పక్క వీధిలో ఉండే జేసీబీ డ్రైవర్ బాలికపై లైంగిక దాడిచేశాడు. వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ చంద్రశేఖర్ రాత్రి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Similar News
News February 26, 2026
ఇంటర్ ఎగ్జామ్స్: వరంగల్ జిల్లాలో ముగ్గురు డిబార్

వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెంటర్లో 191 మందికి 188 మంది హాజరయ్యారు. మోడల్ స్కూల్ సెంటర్‌లో 177 మంది విద్యార్థులకు గాను 174 పరీక్ష రాశారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆబ్సెంట్ అయ్యారు.
News February 26, 2026
తప్పెవరిది? శిక్ష ఎవరికి?

TG: GOVT స్థలాలు, నదీ తీరాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రభుత్వ నిర్ణయం భేష్. HYDలో హైడ్రా, ఖమ్మం <<19243296>>భూదాన్<<>> వ్యవహారంలో సర్కారు తీరును తప్పు పట్టలేం. కానీ తప్పెవరిది? శిక్ష ఎవరికి? పడుతుందనేదే ప్రశ్న. అక్రమార్కులు రూ.కోట్ల డబ్బు దండుకొని సామాన్యులకు స్థలాలను అంటగట్టారు. కష్టపడి కట్టుకున్న గూడు కూలిపోతుంటే ఇప్పుడు వారి గుండె పగులుతోంది. వీరికి ఆ అక్రమార్కుల నుంచి భారీ పరిహారం ఇప్పిస్తే బాగుంటుంది.
News February 26, 2026
జగిత్యాల: మున్సిపల్ కొత్త ఛైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరణ

జగిత్యాల మున్సిపల్ నూతన ఛైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ స్పందన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల బలోపేతానికి కృషి చేస్తానని వాణి పేర్కొన్నారు.


