News September 20, 2025
వాల్మీకి మహర్షి విగ్రహం వివాదం.. టీజీ కుటుంబంపై తప్పుడు ప్రచారం: నేతలు

అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి టీజీ కుటుంబం పాటుపడుతోందని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు, నాయకులు నంది మధు, దశరథ రామనాథనాయుడు పేర్కొన్నారు. కర్నూలులో ఏ ఘటన జరిగినా మంత్రి టీజీ భరత్ కుటుంబానికి ఆపాదించడం కొందరు అలవాటు చేసుకున్నారని మండిపడ్డారు. వాల్మీకి మహర్షి విగ్రహం తొలగింపు విషయంలో మంత్రి భరత్ ప్రమేయం ఉందంటూ మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు.
Similar News
News September 20, 2025
కీర్తి ప్రైమరీ పాఠశాల గుర్తింపు రద్దు: డీఈవో

కర్నూలులోని కీర్తి పాఠశాల ప్రైమరీ సెక్షన్ గుర్తింపు రద్దు చేస్తూ డీఈవో శామ్యూల్ పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15న పాఠశాల ఆవరణలో ప్రహరీ కూలి యూకేజీ విద్యార్థి రకీబ్ బాషా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఈవో విచారించి పాఠశాల ప్రైమరీ సెక్షన్ గుర్తింపు రద్దు చేశారు. రికార్డులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు.
News September 20, 2025
ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చ: జేసీ

జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ నవ్య శనివారం తెలిపారు. సోమవారం నుంచి రూ.1,200 మద్దతు ధర అమలులో ఉండదని, రైతులు కళ్లాల్లో కానీ, లోకల్ ట్రేడర్స్ దగ్గర కానీ, ఇతర మార్కెట్లలో కానీ తమ ఉల్లి పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని అన్నారు.
News September 20, 2025
ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది: ఎస్వీ మోహన్ రెడ్డి

సీఎం చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఉల్లి రైతులను మోసం చేస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. రెండున్నర ఎకరాలకు రూ.50 వేలు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. మార్కెట్‌కి తెచ్చిన ఉల్లి పంటను మీరే అమ్ముకోవాలని, రూ.1,200ల మద్దతు ధరను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం రైతులను దగా చేయడం కాదా? అని ప్రశ్నించారు.