News December 29, 2025

వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు: సుదీప్

image

మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదని హీరో కిచ్చా సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర పలు భాషల్లో అతిథి పాత్రలు చేశాం. నేను కొన్నిసార్లు డబ్బులే తీసుకోలేదు. కానీ ఆయా భాషల నటులు కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేను వ్యక్తిగతంగా కొందరు యాక్టర్స్‌ను అడిగినా నటించలేదు’ అని ‘మార్క్’ సినిమా ప్రమోషన్లలో ఆయన వాపోయారు.

Similar News

News December 29, 2025

ఢిల్లీ హైకోర్టుకు Jr.NTR స్పెషల్ థాంక్స్

image

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ప్రొటెక్టివ్ ఆర్డర్ పాస్ చేసిన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు అనుమతి లేకుండా తమ ఫొటోలు వాడటంపై పవన్ కళ్యాణ్, <<18640929>>Jr.NTR<<>> ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లను వేసిన విషయం తెలిసిందే.

News December 29, 2025

వీరిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం!

image

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేయాలి. జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంక్షేమ అధికారులు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. SHARE IT

News December 29, 2025

VHT: థర్డ్ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

image

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ థర్డ్ మ్యాచ్ ఆడటం కన్ఫర్మ్ అయింది. బెంగళూరులో 2026 JAN 6న రైల్వేస్‌తో మ్యాచులో విరాట్ ఆడుతారని DDCA ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ప్రకటించారు. న్యూజిలాండ్ సిరీస్‌కు వడోదరలో ODI టీమ్ JAN 8లోపు ట్రైనింగ్ కోసం వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో 6న బెంగళూరులో ఆడి 7న అక్కడ రిపోర్ట్ చేస్తారని సమాచారం.