News January 18, 2026

వాహనంలో పశువుల తరలింపు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

image

ఎండ కాస్తున్న సమయంలో, బాగా చల్లని సమయాల్లో, భారీ వర్షంలో జీవాలను రవాణా చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాత్రివేళలో మాత్రమే జీవాలను తరలించాలి. ఈ నిబంధన రోడ్డు మార్గంలో పశువుల తరలింపునకే వర్తిస్తుంది. పశువులను తీసుకెళ్లే వాహనం స్పీడ్‌ గంటకి 40 కిలోమీటర్లు మించకుండా చూసుకోవాలి. స్పీడ్‌ బ్రేకర్లు, మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.

Similar News

News February 9, 2026

పనులన్నీ సకాలంలో పూర్తికావాలి: పవన్

image

AP: క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని Dy.CM పవన్ స్పష్టం చేశారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘మేం నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు. అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయి. పల్లె పండుగ, అడవితల్లి బాట సహా పలు పథకాలకు రూ.11,328 కోట్లు మంజూరు చేశాం. పనులన్నీ సకాలంలో పూర్తికావాలి’ అని సూచించారు.

News February 9, 2026

సచిన్‌లానే వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలి: శశిథరూర్

image

అద్భుతమైన ఆటతీరుతో వైభవ్ సూర్యవంశీ <<19067167>>సంచలనాలు<<>> సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ మరింత త్వరగా ఉన్నత స్థాయికి చేరేందుకు అర్హుడని తాజాగా కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘గతంలో 14 ఏళ్ల జీనియస్‌ను క్రీజులో చూశాం. అతడి పేరు సచిన్ టెండూల్కర్. అతడిని ఎక్కువ కాలం వేచి ఉండనివ్వలేదు’ అని పేర్కొన్నారు.

News February 9, 2026

క్లీనింగ్ టిప్స్..

image

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్‌రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.