News January 14, 2026

వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

image

AP: రహదారి ప్రమాదాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత వాహనాల లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం రహదారి భద్రతా సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ‘ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963’ సవరణకు మంత్రివర్గం, గవర్నర్ ఆమోదం లభించింది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో లైఫ్ ట్యాక్స్‌కు అదనంగా సెస్ చెల్లించాలి. ఈ నిధులను రోడ్ల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపునకు వినియోగించనున్నారు.

Similar News

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: ప్రశ్నాపత్రాల తరలింపు

image

జనగామ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్‌లకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశ్నాపత్రాలను అందజేశారు. పోలీసు బందోబస్తు నడుమ వీటిని నిర్దేశించిన కేంద్రాలకు తరలించారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

News February 21, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>చెన్నై<<>> మెట్రో రైల్ లిమిటెడ్‌లో 19 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.62,000 నుంచి రూ.2,70,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.50. వెబ్‌సైట్: https://chennaimetrorail.org

News February 21, 2026

అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

image

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.