News April 22, 2024

వాహన తనిఖీలకు సహకరించాలి: సిద్దిపేట CP

image

వాహనాల తనిఖీ నిర్వహించేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. వాహనదారులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బులు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు వరకు వాహన తనిఖీల్లో రూ. 66,10,840 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు.

Similar News

News September 30, 2024

నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం: కలెక్టర్

image

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.

News September 30, 2024

ఉమ్మడి మెదక్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దిశగా మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రి సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పలు సమీకరణాలపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

News September 30, 2024

మెదక్: ఉపాధ్యాయుల సర్దుబాటు పునరాలోచించాలి: తపస్

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 అమలు విషయంలో పునరాలోచించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా విద్యాధికారికి సోమవారం తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డు ఎల్లం, ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు అల్లం ఆంజనేయులు, నరేందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.