News March 14, 2025
వింత ఆచారం.. మగాళ్లు చీర కట్టులో!

హోలీ అంటే గుర్తొచ్చేది రంగులు, కాముని దహనం. కానీ ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే జంబలకడిపంబ సినిమా కనపడుతుంది. ఈ రోజున గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తిశ్రద్ధలతో రతి మన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. 100ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు.
#HappyHoli
Similar News
News September 16, 2025
HYD: పడితే కుటుంబాలు రోడ్డున పడతాయ్!

ట్రాలీ నిండా సామాన్లు.. పైన కట్టెలు.. వాటిపైనే ప్రాణాలను ఫణంగా పెట్టిన కూలీలు. అదుపు తప్పితే వారితో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని మరిచిపోతే ఎలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నియమాలను పాటించాలని పోలీసులు చెబుతుంటే పెడచెవిన పెట్టి ప్రమదాలకు గురవుతున్నారు. ఫైన్‌లు వేసినా భయం లేదు. ఈ దృశ్యం పీర్జాదిగూడ పర్వతాపూర్‌లో కనిపించింది. ఇలాంటి ప్రయాణాలు విషాదాంతంగా మారుతాయని గుర్తించండి.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
News September 16, 2025
డ్రగ్స్ తయారీలో పట్టువదలని విక్రమార్కుడు జయప్రకాశ్

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్ నిర్వాహకుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ తయారీకి తెరలేపాడు. ఆల్ర్ఫాజోలం ఎలాగైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1, 2 సార్లు విఫలమైతే కొందరు దానిని ఆపేస్తారు. ఎలాగైనా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 6 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి ఏడోసారి సక్సస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి దందా నిరాటంకంగా కొనసాగించాడని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.