News March 4, 2025
వికసిత్ భారత్ యువ పార్లమెంట్ నోడల్ జిల్లాగా సిద్దిపేట

వికసిత్ భారత్ యువ పార్లమెంట్ నోడల్ జిల్లా గా సిద్దిపేట ఎంపిక అయ్యిందని సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీతా తెలిపారు. భారత యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో దేశ యువత ఆలోచన విధానాలను పాలసీలో పొందుపరిచి ప్రపంచంలోనే భారత దేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడానికి యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. యువత ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News February 21, 2026
KNR. రేపే గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి!

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం రేపు (ఫిబ్రవరి 22) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతితో పాటు, 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష జరుగుతుందని జిల్లా సమన్వయకర్త లక్ష్మి తెలిపారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం గంట వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో మొత్తం 3787 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.
News February 21, 2026
ఉమ్మడి జిల్లాలో 7.55 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. 14 కేంద్రాల ద్వారా 33 వేల మంది రైతుల నుండి రూ.590 కోట్ల విలువైన 7.55 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. గరిష్టంగా క్వింటాకు రూ.8,110 మద్దతు ధర లభించింది. ఇప్పటికే మెజారిటీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని, చివరి దశలో అమ్మిన వారికి త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
News February 21, 2026
నెటిజన్ దారుణ కామెంట్.. గట్టిగా బదులిచ్చిన చిన్మయి!

తనపై దారుణ కామెంట్ చేసిన నెటిజన్‌కు సింగర్ చిన్మయి గట్టిగా బదులిచ్చారు. దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు చేసేవాళ్లు లక్షల్లో ఉన్నారని ఆమె ట్వీట్ చేయగా ‘నిన్ను మీ నాన్న రేప్ చేసుంటాడు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘నా తండ్రి నన్ను రేప్ చేయలేదు. కానీ కూతుళ్లను తండ్రులు రేప్ చేస్తారని మీరు ఊహించుకుంటారు. ఇలా మాట్లాడుతున్నారంటే మీరేంటో, మిమ్మల్ని ఎవరు పెంచారో అర్థమవుతోంది’ అని చిన్మయి కౌంటరిచ్చారు.


