News March 5, 2025

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ విడుదల

image

బుధవారం పాలమూరు వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్. శ్రీనివాస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప చేతుల మీదుగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2025 పోస్టర్ అవిస్కరించారు. ఈనెల నెల 9లోగా 18 నుండి 25ఏళ్లులోపు విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మై భారత్ పోర్టల్ పోర్టల్‌లో నమోదు చేసుకొని ఒక్క నిమిషం వీడియోను పంపాలన్నారు.

Similar News

News February 21, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్

News February 20, 2026

MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

image

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.

News February 20, 2026

MBNR: ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్‌ఎల్‌ఎన్/ ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని డీఈవో సూచించారు.