News January 8, 2026

‘వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి’

image

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంపై కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ, వైద్య-ఆరోగ్యం, విద్య, జల్ జీవన్ మిషన్, అమృత్, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.

Similar News

News January 29, 2026

మేడారం: ‘మళ్లీ వస్తామో.. లేదో.. సల్లంగా సూడు తల్లి’

image

మేడారం వనదేవతలపై వృద్ధురాళ్ల భక్తి అందరినీ కదిలిస్తోంది. వయసు భారంతో నడవలేకపోయినా, కష్టాలను కడతేర్చమంటూ ఆ తల్లుల చెంతకు చేరిన తీరు ఆకట్టుకుంటుంది. ‘సల్లంగా సూడు తల్లి.. వచ్చే జాతర వరకు ఉంటానో లేదో’ అంటూ వారి నడక కలిచివేస్తోంది. భక్తి పారవశ్యంతో పాటు, జీవిత చరమాంకంలో అమ్మవార్ల దర్శనం దక్కడంపై ఇలాంటి భక్తులు వ్యక్తం చేస్తున్న భావోద్వేగం మేడారంలో ప్రతిధ్వనిస్తోంది.

News January 29, 2026

GVMC స్థాయీ సంఘంలో 160 అంశాలకు ఆమోదం

image

విశాఖ మేయర్, స్థాయీ సంఘం ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో 159 ప్రధాన, 13 టేబుల్ అజెండాలతో మొత్తం 172 అంశాలు చర్చించారు. అవినీతికి ఆస్కారం ఉన్న 12 అంశాలను వాయిదా వేసి 160 అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖ భాగస్వామ్యం సదస్సు పనులకు ఆమోదం లభించగా, జీవీఎంసీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.

News January 29, 2026

భారీ జీతంతో ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 13 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. PPP, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. AGMకు నెలకు రూ.1.65,440, Sr. మేనేజర్‌కు రూ.1,44,760, మేనేజర్‌కు రూ.1,24,080, డిప్యూటీ మేనేజర్‌కు రూ.1,03,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in