News March 1, 2026

వికారాబాద్‌కు రేపు VVIPలు.. ట్రాఫిక్ డైవర్షన్స్

image

అనంతగిరి ప్రాంతాల్లో రేపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, CM రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. వికారాబాద్ నుంచి తాండూర్‌కు అనంతగిరి గుట్ట మార్గంలో వచ్చే వాహనాలు బుగ్గరామలింగేశ్వర స్వామి రోడ్డు, మెరినాట్స్ మీదుగా జైదుపల్లికి వెళ్లే రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఇతరులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్నారు.

Similar News

News March 2, 2026

ఖమేనీ అధీనంలో రూ.8.55లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం?

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సుమారు $95B (₹8.55లక్షల కోట్లు) విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తొలి సుప్రీం లీడర్ ఖొమేనీ స్థాపించిన ‘సెటాడ్’ అనే రహస్య సంస్థ పరిధిలో ఇది ఉందని పేర్కొంది. ప్రజల ఆస్తులను జప్తు చేసి విక్రయించేవారని, ప్రతి రంగంలో ‘సెటాడ్‌’కి వాటాలున్నాయని ఆరోపించింది. అయితే ఖమేనీ తాను రిచ్ అయ్యేందుకు సెటాడ్‌ను వాడుకున్నారనేందుకు ఆధారాల్లేవని పేర్కొంది.

News March 2, 2026

ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

News March 2, 2026

వేసవిలో నీటి కష్టాలు రాకూడదు: HNK కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో వేసవిలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పైపులైన్ల లీకేజీలు అరికట్టి, రిజర్వాయర్లలో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ సరఫరాలో జిల్లా 3వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.