News February 24, 2026
వికారాబాద్‌కు HMDA సెగ!

VKBలోని చిట్టిగూడ, యవాపూర్, ఎంకతల, టేకులపల్లిని HMDA పరిధిలోకి తెస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వెనక పొలిటికల్ స్కెచ్ ఉంది. సాధారణ భూసేకరణ చేస్తే కోర్టు చిక్కులు వస్తాయని LADP అస్త్రాన్ని బయటకు తీశారు. రైతుల నుంచి భూమిని సేకరించి, అభివృద్ధి చేసిన ప్లాట్లలో 40% వాటా ఇచ్చి, మిగిలిన భూమిని గ్రిడ్ రోడ్లు, సామాజిక అవసరాలకు వాడుకుంటారు. ఇకపై ప్రైవేట్ వెంచర్ల కంటే సర్కారు లేఅవుట్లే కీలకం కాబోతున్నాయి.
Similar News
News February 24, 2026
రేపు పీయూలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రావీణ్యం కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వెల్లడించారు.
News February 24, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్ హైమావతి

సిద్దిపేట జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 18 వరకు జరగనున్న ఈ పరీక్షలపై CS నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. డీఐఈఓ తదితర అధికారులు పాల్గొన్నారు.
News February 24, 2026
కామారెడ్డి: అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి

అర్హులైన మైనార్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అడిషనల్ ఎస్పీ జయరాజ్ పాల్గొన్నారు.


