News January 7, 2026
వికారాబాద్‌లో ఎలక్షన్.. ఉత్కంఠ

పురపాలక ఎన్నికల కసరత్తు వేగవంతం కావడంతో ఆశావహుల్లో రిజర్వేషన్ల సెగ మొదలైంది. జిల్లాలోని తాండూరు(36), వికారాబాద్(34), పరిగి(18), కొడంగల్(12) మున్సిపాలిటీల్లోని 100వార్డుల అభ్యర్థులు తమ స్థానం ఏ క్యాటగిరీకి కేటాయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల తుది జాబితా అనంతరం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
Similar News
News February 4, 2026
అల్లూరి కలెక్టర్ కీలక ఆదేశాలు

అల్లూరి, పోలవరం జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక, అటవీ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ‘హోం స్టే’ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
News February 4, 2026
MLG: పార్టీలకతీతంగా అందరికీ పథకాలు: సీఎం

మిర్యాలగూడలో బుధవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయాలకతీతంగా BRS, BJP కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల’ నిర్మాణం చేపట్టామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి 1000 బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించామని, రెండేళ్లలో రూ.17,400 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
News February 4, 2026
సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత.. ఎంపీ ప్రశ్నకు సమాధానం

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ వెల్లడించారు. సోలార్ విద్యుత్ ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై బుధవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రమంత్రి వివరాలు వెల్లడించారు.


