News February 26, 2025

వికారాబాద్‌లో మంగళవారం నాటి ముఖ్యాంశాలు

image

✓వికారాబాద్: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్. ✓లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్. ✓బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య. ✓పరిగి: తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు. ✓మహా కుంభమేళాలో ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ. ✓తాండూర్: శరవేగంగా రైల్వేస్టేషన్లో సుందరీకరణ: జీఎం అరుణ్ కుమార్ జైన్. ✓కొడంగల్: మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు.

Similar News

News February 26, 2025

ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.

News February 26, 2025

జనసేన ఆవిర్భావ వేడుకలు.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఈయనే..!

image

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్నూలు పార్లమెంటుకు చింతా సురేశ్ నియమితులయ్యారు. కాగా, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News February 26, 2025

GWL: ‘విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి’

image

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల కేసులు అన్ని కోణాల్లో విచారించాలని, అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

error: Content is protected !!