News February 20, 2025
వికారాబాద్‌లో మార్చ్ 8న మెగా లోక్ అదాలత్: జడ్జి

మార్చి 8న మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తామని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో జిల్లా పోలీస్ అధికారులతో మెగా లోక్ అదాలత్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కక్షిదారులకు అవగాహన కల్పించి మెగా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజీ మార్గంతో కేసులు పరిష్కరించుకోవాలన్నారు.
Similar News
News November 3, 2025
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. దీనిని ప్రారంభించిన ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. సమాజ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను ధారపోసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
News November 3, 2025
సమీకృత వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు

జనాభా పెరుగుదలకు సరిపడే ఆహారం ఉత్పత్తి చేయవచ్చు. కోళ్లు, మేకలు, పందులు, గొర్రెలు, పశువుల పెంపకం వల్ల వచ్చే వ్యర్థాలను సమర్థంగా వినియోగించి భూసారాన్ని పెంచవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో సాగుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. సమగ్ర వ్యవసాయం నుంచి వచ్చే గుడ్లు, పాలు, పుట్టగొడుగులు, కూరగాయలు, తేనే వల్ల రైతులకు నికర ఆదాయం లభిస్తుంది. సమగ్ర వ్యవసాయంతో ఏడాది పొడవునా ఉపాధి, రైతులకు ఆదాయం లభిస్తుంది.
News November 3, 2025
సిద్దిపేట: ‘దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

సిద్దిపేట జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ లో లెవెల్ వంతెనలు, కల్వర్టులు, రోడ్లు శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.


