News April 9, 2025

వికారాబాద్‌లో రేపు జాబ్‌ మేళా

image

వికారాబాద్‌ ఐటీఐ క్యాంపస్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శ్రీమంత టెక్నాలజీస్ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసి 18-27ఏళ్లలోపు వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత వసతి ఇస్తారు, HYDలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 10.30కి జాబ్ మేళా ప్రారంభం కానుంది.

Similar News

News February 20, 2026

హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై వైసీపీ ఆరోపణలేంటి?

image

AP: ‘హెరిటేజ్‌’కు పుణే(MH)లోని ఇందాపూర్ డెయిరీ అనుబంధ సంస్థ అని YCP ఆరోపిస్తోంది. 2015లో అది TTDకి నెయ్యి సరఫరా చేసిందని, నాణ్యత లేకపోవడంతో అనర్హత వేటు వేశారని <<19186015>>జగన్<<>> చెబుతున్నారు. అప్పుడే కల్తీ జరిగితే తమపై ఆరోపణలేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఇందాపూర్’ తమ అనుబంధ సంస్థ కాదని, అక్కడి నుంచి చీజ్ మాత్రమే కొంటామని హెరిటేజ్ స్పష్టం చేసింది. తాము అసలు TTDకి నెయ్యి సరఫరా చేయలేమని పేర్కొంది.

News February 20, 2026

NZB: నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్

image

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.

News February 20, 2026

HYD: 60% వరకు రాయితీతో బైకులు

image

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్‌, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్‌ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.