News February 19, 2025
వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

వికారాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. RTO ఆఫీస్ వద్ద ఆటో, కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
నెల్లూరు: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

మనుబోలు పరిధిలోని భార్య హత్య కేసులో ముద్దాయి రాపూరు శ్రీనివాసులు @ చిన్నోడుకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018 జులై 2వ తేదీ తమ కుమార్తె ప్రేమ వివాహం విషయమై భార్య రాపూరు వెంకటరమణమ్మతో చిన్నోడికి తగాదా జరిగింది. ఆ కోపంతో నెల్లూరు నుంచి KR పురం వెళ్తుండగా మార్గమధ్యలో ఆటోను ఆపి ఆటో జాకీ రాడ్‌తో భార్యపై దాడి చేసి హత్య చేశాడు.
News November 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<
News November 7, 2025
బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.


